తిరుమల: తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి ఏడుకొండల చెంతకు చేరుకుంటున్నారు. భక్తుల రాకతో మూడు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు ( TTD Officials ) వివరించారు.
నిన్న స్వామివారిని 58,607 మంది భక్తులు దర్శించుకోగా 19,841 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.61 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని తెలిపారు.
గజ వాహనంపై పద్మావతి అమ్మవారి దర్శనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, బోర్డు సభ్యులు సుచిత్ర, భక్తులు పాల్గొన్నారు.