తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల ( Tirumala )కు చేరుకుంటున్నారు. కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంవల్ల భక్తులను నేరుగా క్యూలైన్ల గుండా దర్శనానికి పంపిస్తున్నట్లు టీటీడీ అధికారులు(ttd officials) వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనకం కలుగుతుందని వివరించారు.నిన్న 60,931 మంది భక్తులు దర్శించుకోగా 24,038 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(hundi income) రూ. 3.57 కోట్లు వచ్చిందని తెలిపారు.
శుక్రవారం డయల్ యువర్ ఈవో..
డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి కి ఫొన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించారు. భక్తులు సంప్రదించవలసిన ఫొన్ నెంబరు 0877-2263261కు డయల్ చేయాలని పేర్కొన్నారు.