Tirumala Laddu Row | తిరుమలలో రేపు శాంతి హోమం.. ప్రకటించిన సీఎం చంద్రబాబు
Tirumala Laddu Row | తిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
Tirumala Laddu Row | తిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతిహోమం, పంచగవ్యప్రోక్షణ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. తిరుమలలో ఆగస్టు 15న జరిగిన తప్పునకు యాగం చేశారన్నారు. చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. జగన్ ఎంతో అపచారం చేసి.. దాన్ని సమర్థించుకుంటున్నారన్నారు. నిన్నటి నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తుందన్నారు.
సీఎంగా ఉన్న వరకు మతసామరస్యం కాపాడడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటున్నారని.. ఎదురు దాడి చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 3.75లక్షల వీఐపీ టిక్కెట్లు ఇచ్చారన్నారు. తిరుమల ప్రక్షాణళకు దేవుడు తనకొక అవకాశం ఇచ్చారని శ్యామలరావుకి చెప్పి.. అందుకనుగుణంగా పని చేయాలని ఈవోగా నియమించామని వివరించారు. లడ్డూ నాణ్యతపై అనుమానంతోనే నాలుగు ట్యాంకర్లలో నెయ్యి శాంపిల్స్‌ను ఎన్డీడీబీకి పంపామని.. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత ఎస్ వేల్యూస్‌లో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయని చెప్పారు. ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్నారు. చర్యల కోసం నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచారన్నారు. అక్రమాలపై ఐజీ, ఆపైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని, సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. స్వామివారి పవిత్రతను ఎవరు మలినం చేయలేరని.. ప్రక్షాళన చసి తిరుమలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

