తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కంపార్ట్మెంట్ల (Compartments) లోని 18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆర్జిత టోకెన్లు పొందిన వారికి 4 నుంచి 5 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తుందని వివరించారు.
నిన్న స్వామివారిని 67,308 మంది భక్తులు దర్శించుకోగా 26,674 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.82 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్టు(Srivani Trust) నిధులు విడుదల
హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఆగస్టు నెలకు గాను ఒక్కో ఆలయానికి రూ.5 వేలు చొప్పున రూ. 25 లక్షలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా విడుదల చేశారు.