అమరావతి : నెల్లూరు జిల్లాలో(Nellore) పెద్దపులి సంచారం(Tiger migration) స్థానికంగా కలకలం రేపుతున్నది. హైవేపై వెళ్తున్న ఓ కారును పెద్దపుల్లి ఢీ కొట్టిన సంఘటన నెల్లూరు-ముంబై హైవే(Nellore-Mumbai Highway) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లిలో పెద్దపులి సంచరిస్తున్నది. ఈ క్రమంలో పులి నెల్లూరు-ముంబై వెళ్తున్న ఓ కారును ఢీ కొట్టడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. త్వరలోనే పులిని పట్టు కుంటామ ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, పెద్దపులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.