తిరుపతి : తిరుపతి అలిపిరిలోని ( Tirupati Alipiri ) సప్త గోప్రదక్షిణ మందిరంలో టీటీడీ ప్రతి రోజు నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం( Sri Srinivasa Divyanugraha ) టికెట్లను ఆగస్టు 1 నుంచి ఆన్లైన్లో ( Online ) మాత్రమే జారీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. ప్రతి రోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లు జారీ చేస్తున్నామని, భక్తుల విజ్ఞప్తి మేరకు మొత్తం 200 టికెట్లు ఆన్లైన్లో మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిందని అన్నారు.
భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఈ విశేషహోమంలో రూ.1600 చెల్లించి ఇద్దరుగృహస్తులు మాత్రమే పాల్గొనవచ్చని సూచించారు. హోమంలో పాల్గొనే గృహస్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తామన్నారు.