తిరుమల : టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు (Abbaprasadan Trust) రూ.1 నుంచి రూ.లక్షలోపు విరాళం ఇవ్వదలచిన భక్తుల కోసం పలు చోట్ల నెలకొల్పిన కియోస్క్ మిషన్ల (Kiosk Missions) ద్వారా 50 రోజుల్లో రూ. 55 లక్షల విరాళం (Donations) వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయాల్లో టీటీడీ ఈ మిషన్లు ఏర్పాటు చేసింది. పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో శనివారం ఈ కియోస్క్ మిషన్ ను టీటీడీ (TTD) అడిషనల్ ఈవో ప్రారంభించారు. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉందని, త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు.