అమరావతి : వైసీపీ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు(YCP MPs) పిల్లి సుభాష్ చంద్రబోస్(Pilli Subhash Chandra Bose) , అయోధ్య రాంరెడ్డి(Ayodhya Ram Reddy) స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీ, జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, గెలిచినప్పుడు కుంగిపోయి, ఓడిపోతే దిగాలు పడడం సరికాదని అన్నారు. తామంతా స్పోర్టివ్ స్ఫూర్తితో ఉన్నామని వెల్లడించారు. నూటికి నూరుపాళ్లు జగన్ (Jagan) నాయకత్వాన్ని బలపరుస్తామని స్పష్టం చేశారు. తమపై వస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరారు. ఒకరిద్దరు పార్టీలు మారినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.
జగన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. తమపై ఎంతో నమ్మకంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాజ్యసభ్యకు పంపారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారని పిల్లి సుభాష్ వెల్లడించారు.