తిరుమల : తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల (Special Festivals ) వివరాలను టీటీడీ (TTD) అధికారులు ప్రకటించారు. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, 3న భగినీహస్త భోజనం, తిరుమలనంబి శాత్తుమొర, 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, 6న మనవాళ మహామునుల శాత్తుమొరను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణచ 9న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం లాంటి పర్వదినాలు శాస్త్రప్రకారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
11న యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి, 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, 15న కార్తీక పౌర్ణమి (Kartika Poornami ) , 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రిని వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు నేరుగా ఆరు గంటల్లో దైవదర్శనం కలుగుతుందని వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,844 మంది భక్తులు దర్శించుకోగా 27,418 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.27 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.