అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు తిరుగుబాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాలలో రెండోరోజు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ప్రజలు తిరుగుబాటు చేస్తే వారి పోరాటానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఏపీలోని పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నరసాపురం ఎంపీని తన ప్రాంతానికి కూడా జగన్ రానివ్వడం లేదని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు ఎక్కడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ దోపిడిని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జగన్ అచారకాలు ఇలాగే కొనసాగితే ఎక్కడా కూడా ఆయన తిరగలేడని వెల్లడించారు.