అమరావతి : తెలుగు ప్రజలకు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Balakrishna) సంక్రాంతి (Sankranti) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మూడురోజులపాటు జరుపుకునే పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే పల్లెటూర్లు, పల్లెటూర్లు అంటే సంక్రాంతి అని అన్నారు. కళకళలాడాల్సిన పల్లెటూర్లు ఏపీ సీఎం జగన్ సైకో(Psycho) పాలనలో వలసలతో వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు.
నిత్యావసర ధరలు పెంచి పేదలకు పండుగను దూరం చేశారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పేదల ప్రభుత్వం ,రైతు రాజ్యం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు .