అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండు మున్సిపాలిటీల గ్రేడ్ ( Muncipaltiies Grade )పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూర్ మున్సిపాలిటీ హోదా గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 కు పెంచుతూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ (Suresh kumar ) ఉత్తర్వులు జారీ చేశారు.
2021 నుంచి వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ హోదా పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పెషల్ గ్రేడ్‌లో ఉన్న కదిరి మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇవాల్టి నుంచే మున్సిపాలిటీ గ్రేడ్ పెంపు అమల్లోకి వస్తుందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.