అమరావతి : సంక్రాంతి పండుగతో పాటు ఎప్పుడు తన విమర్షలు, సెటైర్లతో వార్తలో నిలిచే వైసీపీ నాయకుడు ఈసారి తనదైన శైలీని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ (YCP ) లో తనకంటూ ముద్ర వేసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) ఈ సంక్రాంతికి కూటమి ప్రభుత్వాన్ని ( Alliance Government ) విమర్శిస్తూ బృంద సభ్యులతో డ్యాన్స్( Dance) చేసి ఆకట్టుకున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. #Sankranti pic.twitter.com/C5lsANxjXz
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2026
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రంలో బుధవారం పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తూ రూపొందించిన పాటపై నృత్యం చేశారు. ‘ పండుగ వచ్చింది..సంక్రాంతి పండుగ వచ్చింది. దగాకోరు పాలనలో పేదల బతుకుల్లో చీకటిని తెచ్చిందంటూ ’ పాటపై డ్యాన్స్ చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కూడ మంత్రిగా ఇదే రీతిలో ఆనందం పంచుకుంటూ సందడి చేశారు.