అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్(Steel Plant ) కోసం భూములిచ్చిన నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. ఛలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమంలో భాగంగా గేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
భూములు ఇచ్చిన ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఎకరం చొప్పున వన్‌టైం సెటిల్మెంట్ చేసేంత వరకు జీవన భృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చి నలభై ఏళ్లకు పైగా గడిచినా, ఇంతవరకు భూ నిర్వాసితులకు కల్పిస్తామన్న ప్రయోజనాలను కల్పించ లేదని ఆరోపించారు. ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే వారి భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.