రాజమండ్రి: తూర్పు గోదావరిలోని యానాంలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆర్థిక లావాదేవీలే వీరి మధ్య ఘర్షణకు కారంగా స్థానిక పోలీసులు భావిస్తున్నారు. బాధితులు, నిందితులు అంతా ఏపీలోని కొవ్వూరుకు చెందినవారుగా గుర్తించారు. మృతిచెందిన వ్యక్తిని ఐ.పోలవరం వెంకటేశ్వర్రావుగా గుర్తించారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తెలుగు యువకుల మధ్య ఘర్షఐ ఒకరి ప్రాణాలను బలితీసుకున్నది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ముగ్గురు యానాంలో నివాసముంటున్నారు. ఇదే జిల్లా ఐ.పోలవరం మండలానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా యానాంలోనే ఉంటున్నారు. మద్యంమత్తులో వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. యువకుల మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే కొవ్వూరు యువకులు ఐ.పోలవరంకు చెందిన ఇద్దరిని నడిరోడ్డుపైనే కత్తులతో నరికారు.
ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ దవాఖానకు తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తున్నది. ఈ గొడవపై సమాచారం అందుకున్న యానాం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన యువకుల కోసం గాలింపు చేపట్టారు. కాజలూరుకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి నారాయణ స్వామి మధ్యాహ్నం తమ ఇంటికి వచ్చాడని, ఆయననే తన తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నట్లు మృతుడి కుమారుడు ఆనందమూర్తి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు.