ఢిల్లీ : తెలంగాణ ఉద్యమం ( Telangana movement ) తనలో స్ఫూర్తినింపిందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. తెలంగాణ యువత బలిదానాలు తనను కదిలించాయని వెల్లడించారు. జనసేన ( Janasena ) ఆధ్వర్యంలో జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరిట ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ నేల కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని అన్నారు.
తెలంగాణ ఆవిర్భావం రోజున జనసేన ఆధ్వర్యంలో సమావేశానికి అనుమతి కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. అమరులకు నివాళులు అర్పించడానికి పర్మిషన్ కావాలా అంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుంది. ఇది నా నేల కాదా ? నా దేశం కాదా? అంటూ నిలదీశారు. క్రిమినల్ పార్టీలతో పోరాటామని స్పష్టం చేశారు.
పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఏనాడు అడ్డు చెప్పలేదని, ఏపీని విభజించిన తీరును మాత్రం వ్యతిరేకించానని వెల్లడించారు. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీ నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వాలు వచ్చాయని వివరించారు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఢిల్లీ కేంద్రంగానే మాట్లాడాలని పేర్కొన్నారు.