ఎన్టీఆర్ జిల్లా : గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య కోల్డ్‌వార్ కాస్తా ప్రత్యక్ష యుద్దానికి దారితీసింది. గుడివాడలోని కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా కార్యకర్తలు విశ్వప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలుఊ-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది.
మహిళలపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీడీపీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిని నేతను పోలీసులు వెనకేసుకు వస్తున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఈ దశలో టీడీపీ కార్యకర్తలు-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆందోళన చేపడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను కించపరిచిన కొడాలి నాని బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అంతకు ముందు గుడివాడ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేపట్టారు. కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించవద్దని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కొడాలి నాని ఆదేశాలతోనే తమను వేధిస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు వెళ్తుండగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.