(Somireddy coments) మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎవరి బాగు కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారో తెలియడం లేదన్నారు. పేదలను జలగల్లా పీల్చే అలవాటు ఇంకా మానుకోవడం లేదని, ఇంటి హక్కు పేరుతో పేదల రక్తం తాగేందుకు కుట్ర పన్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ జగనన్న గృహ వంచన పథకం అని ఆరోపించారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఓటీఎస్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం.. పేదల ప్రజల గొంతుపై కత్తి పెట్టారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కట్టి ఇచ్చిన ఇల్లు లేదు, కట్టుకున్న ఇంటికి బిల్లు లేదు, పూర్తైనా టిడ్కో ఇళ్లు ఇవ్వనూ లేదని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల పేరుతో పంచిన డబ్బును దొడ్డిదారిని వసూలు చేసుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో చేస్తున్న రిజిస్ట్రేషన్ల చట్టబద్ధతపై సోమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే రంగు కాగితాలకు విలువ ఉంటుందా అని నిలదీశారు. ఐచ్ఛిక కార్యక్రమం అని కాగితాలపై ప్రింట్ చేసి, కంపల్సరీ కార్యక్రమంగా చేపడుతున్నారన్నారు. ఈ పథకమే ఒక ప్రహసనంగా మారిపోయిందన్నారు.
46 లక్షల మంది పేదలను మోసం చేసి రూ.4800 కోట్లు కలెక్ట్ చేయాలని ప్లాన్ చేశారని, ప్రభుత్వం దివాళ తీస్తే పేదల నుంచేనా డబ్బు వసూలు చేసేదని అని మండిపడ్డారు. పేదల నుంచి రూపాయి తీసుకోకుండా చట్టబద్దంగా ఇంటిపై హక్కు కల్పించండి అంతేగానీ, వారిని పీల్చిపిప్పి చేయొద్దు అని సూచించారు. పేద ప్రజలపై ప్రభుత్వానికి ఏపాటి గౌరవం, ప్రేమ ఉన్నదో ఈ పథకాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..