OG 2 | స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో రూపొందిన ‘OG’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘OG-2’ తెరకెక్కబోతుందనే వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మొదటి భాగం విడుదలైన కొద్ది రోజులకే సీక్వెల్‌పై చర్చలు మొదలుకావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘OG-2’ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. దర్శకుడు సుజిత్ కథకు ఫైనల్ టచ్ ఇస్తున్నారని, త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగం పుంజుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. సీక్వెల్‌ను మొదటి భాగం కంటే మరింత భారీ స్థాయిలో, పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ‘OG-2’లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్‌తో కలిసి నటించిన కాజల్, మరోసారి ఈ కాంబినేషన్లో కనిపిస్తారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ సీక్వెల్లో భాగమైతే సినిమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ ఎంపికపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొదటి భాగంలో ప్రియాంక మోహన్ కీలక పాత్రలో కనిపించగా, రెండో భాగంలో కూడా ఆమె కొనసాగుతారా? లేక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు.
కొంతమంది మాత్రం కాజల్ పేరు కేవలం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న రూమర్ మాత్రమేనని, ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెబుతున్నారు.‘OG-2’ను మరింత స్టైలిష్‌గా, యాక్షన్ ఎలిమెంట్స్‌తో నిండిన భారీ సీక్వెల్‌గా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కథ, పాత్రలు, విజువల్స్ అన్నింటిలోనూ మొదటి భాగం కంటే మరింత స్థాయిని అందుకునేలా సుజిత్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ నిజంగానే ‘OG-2’లో భాగమవుతారా? లేక మేకర్స్ కొత్త హీరోయిన్ను ఎంపిక చేస్తారా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.