అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా అధికార పార్టీకి చెందిన గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) గుమ్మనూరు జయరాం (Gummanuru Jayaram) మీడియా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ (Warning) ఇచ్చారు. తన నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే హెచ్చరికలు జారీ చేశారు.
నాపై వివాదాలు రాస్తే మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పండబెడుతా
మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
మీడియా అంటే నాకు లెక్కలేదు
నేను అన్ని చేసి వచ్చిన వాడిని.. రాసుకోండి. ఏం రాసుకుంటారో – అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం pic.twitter.com/ifyGcbCMZZ
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
తనకు సంబంధం లేకుండా నిరాధారణ వార్తలు రాస్తే రైలు పట్టాలపై ( Railway Track) పండబెడుతానని ఘాటుగానే హెచ్చరించారు. మీడియా అంటే నాకు లెక్కలేదని స్పష్టం చేశారు. అన్ని చేసి వచ్చిన వాడిని. ఏం రాసుకుంటారో. రాసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
తాను తప్పుచేయనని, తప్పు చేసినట్టయితే తన దృష్టికి తీసుకువస్తే సరిదిద్దుకుంటా. తప్పు చేయనట్టయితే తాట తీస్తానని మరోసారి హెచ్చరిస్తున్నాని, వార్తలు రాసేటప్పుడు అన్ని విధాలా ఆలోచించి వార్తలు రాయాలని హితవు పలికారు.