అమరావతి : అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri ) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోని చెరువుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను రాత్రి టీడీపీ శ్రేణులు అడ్డుకుని పట్టుకున్నారు. ఇదే విషయమై మంగళవారం వాహనదారులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
ఈ సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) జేసీ అస్మిత్‌రెడ్డి (C Asmit Reddy) సీఐ లక్ష్మీకాంతరెడ్డికి ఫోన్ చేశారు. నువ్వుచెబితే కేసు పెట్టలా అని సీఐ నిర్లక్ష్యంగా సమాదానం ఇవ్వడంతో టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తాడిపత్రి గ్రామీణ పీఎస్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. తిరుపతి జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలుపడతంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఎమ్మెల్యేకు సీఐ క్షమాపణ చెప్పాలని, ఇసుక అక్రమ రవాణాదారులకు సహకరిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో మాట్లాడారు.