అమరావతి : మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) కోనేటి ఆదిమూలం ( Adimoolam suspension) పై టీడీపీ అధిష్టానం వేటు వేసింది. అతడిని సస్పెన్షన్(Suspension) చేసినట్టు ప్రకటించింది. లైంగిక వేధింపుల ఆరోపణల దరిమిలా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం హైదరాబాద్‌లో బాధితురాలు మీడియా సమావేశంలో సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులపై పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన దరిమిలా వెంటనే స్పంధించిన టీడీపీ అధిష్టానం కొన్ని గంటల్లోనే ఆయనపై యాక్షన్ తీసుకున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు వెల్లడించారు.
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచాడు. 2024లో వైసీపీ అధిష్టానం ఆదిములాన్ని తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించగా అందుకు ఆయన అంగీకరించలేదు. దీంతో ఆదిమూలం వైసీపికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అనంతరం సత్యవేడు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.