అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధాలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీరామ్ ఇటీవల తన తల్లి పరిటాల సునీతాతో కలిసి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు.
‘కరోనా పరీక్షల్లో నాకు స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు, మీడియా మిత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ పరీక్షలు చేయించుకోమని తెలియజేస్తున్నాను’ అని పరిటాల శ్రీరామ్ ట్వీట్ చేశారు.