Buddha Venkanna | ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.. పెద్దిరెడ్డికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న వార్నింగ్
Buddha Venkanna | వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు పుంగనూరు వచ్చినప్పుడు ఆయనపై దాడులు చేయించారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే తమ నాయకుడికి భయం లేదని.. దోచుకున్న మీకు భయం కాబట్టే పారిపోతున్నారని విమర్శించారు.
Buddha Venkanna | వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు పుంగనూరు వచ్చినప్పుడు ఆయనపై దాడులు చేయించారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే తమ నాయకుడికి భయం లేదని.. దోచుకున్న మీకు భయం కాబట్టే పారిపోతున్నారని విమర్శించారు. అందుకే నిన్న మిమ్మల్ని అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్లతో దాడి చేయించారని అన్నారు.
దోచుకోమని పెద్దిరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ మైనింగ్ అప్పగించారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. దొంగ చేతికి తాళం ఇచ్చారు కాబట్టే సంపద మొత్తం దోచేశారని విమర్శించారు. పెద్దిరెడ్డి వేల కోట్లు అక్రమంగా దోచేశాడని అన్నారు. అధికార, ధన బలంతో పెద్ది రెడ్డి కుటుంబం విర్రవీగిందని.. ఆ అరాచకాలు చూడలేకనే ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు.
డబ్బు మదంతో తండ్రీకొడుకులు దాడులు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి డబ్బులు వెదజల్లారని విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం స్గిగు చేటు అని అన్నారు. నిజంగా మేం తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా? అని ప్రశ్నించారు. తమ నాయకుడు సంయమనంతో ఉండాలని చెప్పారని.. కాబట్టే సైలెంట్‌గా ఉన్నామన్నారు. లోకేశ్ రెడ్‌బుక్ పేరు చెబితేనే భయపడుతున్నారని.. ఆ బుక్‌లో పేర్లు ప్రకటిస్తే ఇక మీ పరిస్థితి ఏంటి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని పెద్దిరెడ్డికి సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

