(TDP Protest rally) నెల్లూరు : రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరల వ్యత్యాసాన్ని చూపుతూ ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో నిత్యవసర వస్తువులను విక్రయించారు. కొంతమంది మహిళలు సోమిరెడ్డి చేతులు మీదుగా విక్రయించిన నిత్యవసరాలను కొనుగోలు చేశారు.
ఫలానా వస్తువు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎంత ధర ఉన్నది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎంతున్నదని వినియోగదారులను సోమిరెడ్డి ప్రశ్నించారు. ధరల పెరుగుదలలో మార్పును గమనిస్తున్నారా? లేదా? అని అడిగారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడూతూ, అధికార పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారి ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు.
ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, గుమ్మడి రాజయాదవ్, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డితోపాటు స్థానిక టీడీపీ నాయకులు కోదండరామయ్య, పల్లికొండ శీనయ్య, అక్కయ్యగారి ఏడుకొండలు, ఎల్లంగారి రమణయ్య, ఎల్లసిరి రాజేష్ , దండు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..