Varanasi | రాజమౌళి సెట్స్‌లో 20 నిమిషాలే లంచ్ బ్రేక్.. ఆయనే నేను చూసిన బెస్ట్ యాక్టర్: పృథ్వీరాజ్
Varanasi | మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’లో ‘కుంభ’ అనే కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్, రాజమౌళి పనితీరు, ఆయన డైరెక్షన్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Varanasi | మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’లో ‘కుంభ’ అనే కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్, రాజమౌళి పనితీరు, ఆయన డైరెక్షన్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్, తన కెరీర్లో తాను చూసిన గొప్ప దర్శకుల్లో రాజమౌళి ఒకరని పేర్కొన్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా, అద్భుతమైన నటుడిగా కూడా ఆయనను అభివర్ణించారు. ‘వారణాసి’ చిత్రీకరణ సమయంలో రాజమౌళి పని పట్ల చూపించే అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని పృథ్వీరాజ్ తెలిపారు. షూటింగ్ ప్రారంభానికి ముందే సెట్స్‌కు వచ్చి, చివరిగా వెళ్లేది కూడా ఆయనేనని చెప్పారు.
అంత పెద్ద సినిమా చేస్తున్నప్పటికీ ఆయనలో ఏమాత్రం అలసట కనిపించదు. కొత్త దర్శకుడు తన తొలి సినిమా తీస్తున్నట్లుగా అదే కసి, అదే ఎనర్జీతో పనిచేస్తుంటారు. షూటింగ్ సమయంలో లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే ఉండేది అంటూ నవ్వుతూ చెప్పారు. రాజమౌళి సన్నివేశాలను వివరించే విధానం గురించి కూడా పృథ్వీరాజ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక సీన్‌ను వివరిస్తూ ఆయన స్వయంగా ఆ పాత్రలోకి వెళ్లి నటించి చూపిస్తారని అన్నారు. అయితే దర్శకుడు చూపించిన విధానాన్ని యాక్టర్లు యథాతథంగా అనుకరించాలని ఆయన ఎప్పుడూ కోరరని తెలిపారు. సన్నివేశానికి కావాల్సిన భావోద్వేగ స్థాయిని అర్థం చేసుకునేలా మాత్రమే ఆయన ప్రదర్శిస్తారని చెప్పారు.
సీన్లోని ఎమోషన్‌ను అర్థం చేసుకునేందుకు ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత మనం మన స్టైల్లో ఆ భావాన్ని వ్యక్తపరచాలని ప్రోత్సహిస్తారు అని పృథ్వీరాజ్ వివరించారు. తన కెరీర్లో లెజెండరీ నటుడు మోహన్‌లాల్ దర్శకత్వంలో కొద్ది రోజులు పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్న పృథ్వీరాజ్, ఆ తర్వాత అంతటి గొప్ప నటుడిగా కనిపించిన దర్శకుడు రాజమౌళి మాత్రమేనని అన్నారు. మోహన్‌లాల్ తెరకెక్కించిన ‘బరోజ్’ చిత్రంలో తాను నటించాల్సి ఉన్నప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆ షూటింగ్ అనుభవం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘వారణాసి’ చిత్రీకరణ సమయంలో కొన్ని సందర్భాల్లో రాజమౌళి కోరుకున్న భావోద్వేగ స్థాయి తనకు ఎక్కువగా అనిపించేదని పృథ్వీరాజ్ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో నేను ఒకలా ఆలోచిస్తే, రాజమౌళి మరోలా ఊహించేవారు. కానీ ఆయనలాంటి మాస్టర్ స్టోరీటెల్లర్ను పూర్తిగా నమ్మాల్సిందే అని నేను నిర్ణయించుకున్నాను అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

