అమరావతి : ఏపీలో టీడీపీ అభ్యర్థి ఒకరు పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో తొలి జాబితాను ప్రకటించిన వారం రోజుల్లోనే టీడీపీ అభ్యర్థి(TDP Candidate) మహాసేన రాజేశ్(Rajesh) పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం (P Gannavaram) నియోజక వర్గం నుంచి రాజేశ్ పేరును చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. అయితే రాజేశ్ అభ్యర్థిత్వాన్ని ఇరుపార్టీలకు చెందిన నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వీరితో పాటు కుల సంఘాలు కూడా రాజేశ్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో బాహటంగానే ఆయన అభ్యర్థిత్వంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని, కులరక్కసి చేతిలో బలైపోయానని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మహాసేన పేరుతో సోషల్ మీడియాను నిర్వహిస్తున్న సమయంలో రాజేశ్ హిందూవుల గురించి, వారి దేవుళ్ల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హిందూ సంఘాలు అభ్యంతరం తెలుపుతూ ఆందోళన చేయడంతో ఆయన పోటీనుంచి తప్పుకున్నారు.