ప్రకాశం : తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఏడో మైలు చెక్‌పోస్టు సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారు ధ్వంసమైంది.
హైదరాబాద్ నుంచి తణుకు బయల్దేరిన నాగేశ్వర్రావు వాహనం.. ప్రకాశం జిల్లా సమీపంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్ ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో ఎదురుగా మాచర్ల నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారును ఢీకొన్నది. రెండు కార్లలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. మరో కారులో ఎమ్మెల్యే తణుకు బయల్దేరి వెళ్లారు.