అమరావతి : మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ సీనియర్ నేత నారాయణ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని అన్నారు. మెగా అభిమానులు ఈ వ్యాఖ్యలను మర్చిపోవాలని కోరారు. చిరంజీవి రంగులు మార్చే వ్యక్తని, పవన్ కల్యాణ్ ల్యాండ్‌మైన్ అంటూ నారాయణ నిన్న విమర్శించారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపైకి నటుడు చిరంజీవిని ఆహ్వానించడం పెద్ద పొరపాటని ఆయన వ్యాఖ్యనించారు. రాజకీయంలో రంగులు మార్చే చిరంజీవికి బదులుగా అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించిన నటశేఖర కృష్ణను వేదికపైకి పిలుస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.