అమరావతి : భారత నౌకాదళం (Navy) ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో విశాఖ(Visaka) ఆర్కే బీచ్రోడ్లో ఆదివారం నిర్వహించిన 9వ వైజాగ్ నేవీ మారథాన్ (Navy Marathon) 2024 విజయవంతం అయ్యింది. ఈ మారథాన్లో సుమారు 15 వేల మంది స్థానికులు, ఇతర రాష్ట్రాలు, 9 దేశాల నుంచి వచ్చిన మారథాన్ క్రీడకారులు పాల్గొన్నారు.
నిర్వాహకులు నాలుగు విభాగాల్లో 42, 21, 10, 5 కి. మీల మారథాన్ నిర్వహించగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్(Vice Admiral) రాజేష్ పెందార్కర్ జెండాను ఊపి మారథాన్ ప్రారంభించారు. మారథాన్లో గెలిచిన విజేతలకు రూ. 10 లక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా వైస్ అడ్మిర్ రాజేశ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు పెంచేందుకు మారథాన్ లాంటీ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. అందరూ ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆరోగ్య సమాజాన్ని (Healthy Society) తయారు చేసుకోవచ్చని సూచించారు.