వైసీపీ నాయకులపై దాడులను ఆపాలి.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ అయోధ్య రామిరెడ్డి డిమాండ్
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంటులో గళమెత్తుతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఏపీ సీఎం చంద్రబాబు ఆపాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంటులో గళమెత్తుతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఏపీ సీఎం చంద్రబాబు ఆపాలని డిమాండ్ చేశారు.
వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యపై ఆయోధ్య రామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రషీద్‌ను కత్తితో చేతులు నరికి, తీవ్రంగా దాడి చేసి చంపడం దారుణమని అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేయకుండా చంద్రబాబే వారి పార్టీ కేడర్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 22 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలుపుతారని చెప్పారు. ఏపీలో జరిగే దాడులను దేశ ప్రజలకు సైతం తెలియజేస్తామని.. ఇందుకోసం ఫొటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏపీలోని పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరామని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాలని కూడా కోరుతామని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

