Janasena | ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.
ఎమ్మెల్యే కారుపై జరిగిన దాడి విషయం తెలిసి జనసైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలరాజు స్పందిస్తూ.. తాను సేఫ్‌గా ఉన్నానని తెలిపారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఘటనపై విచారించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కారుపై దాడి ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
సామాన్యుడిలా ఐటీడీఏ కార్యాలయానికి ఎమ్మెల్యే
పోలవరం నియోజకవర్గంలోని కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖానికి మాస్క్, నెత్తికి క్యాప్ పెట్టుకుని ఒక సామాన్యుడిలా ఆఫీసు లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో పని వదిలేసి ఓ ఉద్యోగి తాపీగా పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఉద్యోగి సాయికుమార్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
సామాన్యుడిలా ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లిన జనసేన ఎమ్మేల్యే.. ఆఫీసులో పజ్జీ గేమ్ ఆడుతున్న ఉద్యోగి
పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని తనిఖీకి వెళ్ళారు.
ఆఫీసు సమయంలో పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్న… pic.twitter.com/mjRtGAd79G
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024