తిరుపతి జిల్లా : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్లెట్ను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి ఆవిష్కరించారు. బుధవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈవో బుక్లెట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వ తేదీ వరకు జరుగనున్నాయి.
సాలకట్ల బ్రహోత్సవాల నేపథ్యంలో ఈ నెల 20న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 26వ తేదీన రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనున్నది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడవాహనం, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5 వ తేదీన చక్రస్నానం జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, న్యాయాధికారి రెడ్డెప్పరెడ్డి, బోర్డు సెల్ డిప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి తదితరులు పాల్గొన్నారు.
వాహనసేవల వివరాలు..