Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ పెద్దిరాజు తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు, షష్టి తిథి సందర్బంగా కుమారస్వామికి అభిషేకాలు, షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవ గన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేశారు. ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పం పఠించి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.