HomeAndhrapradesh-newsSrisailam Temple Ugadi Mahotsavalu At Srisailam Mallanna Temple From March 27th Kannada Devotees Rush
Srisailam Temple | ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం రెడీ.. శ్రీగిరుల్లో కన్నడ భక్తుల సందడి.. photos
Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రంలో శ్రీశైలంలో గురువారం నుంచి సోమవారం వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది.
2/23
గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలవుతాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
3/23
భ్రమరాంబ అమ్మవారు ఉదయం మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించనున్నారు.
4/23
ఈ తర్వాత పలు పూజా క్రతువులు కొనసాగుతాయని.. సాయంత్రం అమ్మవారికి విశేష అర్చనతో పాటు హోమాలు నిర్వహించనున్నట్లు రాత్రి సమయంలో స్వామి అమ్మవార్లు రాత్రి భృంగి వాహనంపై వివరిస్తారని తెలిపారు.
5/23
ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ విద్దుద్దీపాలు, రంగరంగుల పూలతో అలంకరించారు.
6/23
మరో వైపు ఆలయానికి కన్నడ భక్తుల తాకిడి పెరిగింది.
7/23
ఉగాది మహోత్సవాల్లో మల్లన్నను దర్శించుకునేందుకు వందల కిలోమీటర్ల దూర ప్రాంతాల నుంచి కాలినడకన శ్రీశైల క్షేత్రానికి చేరుకుని మెక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
8/23
గురువారం నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
9/23
ఈ క్రమంలో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు నిలిపివేసి.. భక్తులందరికీ అలంకార దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో తెలిపారు.
10/23
దర్శనానికి వచ్చే భక్తులు దేవస్థానం అధికారులు సిబ్బందితో పాటు పోలీసు, సెక్యూరిటీ, శివ సేవకులకు సహకరించాలని ఆయన కోరారు.