Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇటీవల కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పీ రమేశ్ నాయుడు, సభ్యులుగా ఏవీ రమణ, బీ రవణమ్మ, జీ లక్ష్మీశ్వరి, కే కాంతివర్ధిని, ఎస్ పిచ్చయ్య, జే రేఖాగౌడ్, ఏ అనిల్‌కుమార్, డీ వెంకటేశ్వర్లు, బీ వెంకటసుబ్బారావు, సీహెచ్ కాశీనాథ్, ఎం మురళీధర్, యూ సుబ్బలక్ష్మి, పీయూ శివమ్మ, జీ శ్రీదేవి ప్రమాణం చేశారు. పాలకవర్గంతో అసిస్టెంట్ కమిషనర్, సహాయ కార్యనిర్వహణ అధికారి ఈ చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. అనంతరం పాలకవర్గానికి ఆశీర్వచనం చేసి.. స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేసి సత్కరించారు.