అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి (Srisailam reservoir) ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. స్పిల్‌వే ద్వారా 55,782 క్యూసెక్కులు. ఎగువ నుంచి 1.38 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండడంతో శ్రీశైలం 2 గేట్లు (Gates) ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.40 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 68,235 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నది నిలకడగా కొనసాగుతుంది. ఈ ఆనకట్ట వద్ద 15.30 అడుగుల నీటిమట్టం ఉంది. సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నామని వివరించారు.