పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం.. రేపు గేట్లు ఎత్తే అవకాశం!
శ్రీశైలం ప్రాజెక్టు | కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్ఈ వెంకట రమణ తెలిపారు.

శ్రీశైలం : కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 876 అడుగుల చేరింది. ఎగువ నుంచి 1.5 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇన్‌ఫ్లో ఇలానే కొనసాగితే మరో 24 గంటల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికి గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.6615 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండటంతో కుడిగట్టు కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వానికి అనుమతించింది. ఓ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జెన్కో సీఈ సుధీర్ బాబు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..
Viveka Murder Case : అనుమానితులందరినీ విచారిస్తున్న సీబీఐ
కడప జిల్లాలో దారుణం : సర్పంచ్‌ను నరికి చంపిన ప్రత్యర్థులు
ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు, 19 మరణాలు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

