Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్ఠ నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు మరియు పరివార దేవతాలయాల హుండీలను లెక్కింపు చేశారు. గత 29 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,31,70,665 ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు.
127 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 4.400 కేజీల వెండి ఆభరణాలు కూడా లభించాయని ఈఓ పెద్దిరాజు చెప్పారు. వీటితోపాటు 489 అమెరికా డాలర్లు, 20 సింగపూర్ డాలర్లు, ఐదు యూరోలు, 4,445 యూఏఈ దీర్హామ్స్, ఒక మలేషియా రింగేట్స్, 108 ఖతార్ రియాల్స్, 15 సౌదీ అరేబియా రియాల్స్, ఐదు లక్షల వియత్నాం డాంగ్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 90 థాయిలాండ్ పౌండ్లతోపాటు వివిధ దేశాల కరెన్సీని భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు డిప్యూటీ ఈవో రవణమ్మ తెలిపారు.
ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు.. 7.28 కోట్లు దాటిన ఐటీఆర్స్..!
Stocks | ఆటో.. ఐటీ స్టాక్స్ పతనంతో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు .. !
UPI Payments | వరుసగా మూడో నెలలోనూ అదే రికార్డు.. జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్..!
Bank of England | 5శాతం వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. 16 ఏండ్ల గరిష్టం నుంచి కోత..!