Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. తుగ్గిలి నాగేంద్ర అనే భక్తుడు కుటుంబంతో వంద గ్రాముల బంగారంతో కాసుల పేరును చేయించి శనివారం ఆలయంలో అధికారులకు అందజేశారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచనమండపంలో దాతలు ఈ బంగారు హారాన్ని ఈవో ఎం శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం భక్తుడికి రశీదును అందజేయగా.. పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు గంటి రాధకృష్ణమూర్తి, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కే మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.