Srisailam | శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్ జలాశయం సరికొత్త శోభను సంతరించుకున్నది. పగటి వేళలో నీటి గర్జనతో చేయగా.. రాత్రి సమయంలో శ్రీశైలం డ్యామ్ అందాలు అదరహో అనిపిస్తున్నాయి.
3/14
విద్యుద్దీపాల వెలుగులతో అద్భతుంగా ప్రకాశించిపోతుంది. శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్ల నుంచి వస్తున్న కృష్ణమ్మ జలాలు, జాతీయ పతాకం రంగుల కాంతులతో నిండిపోయి.. ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతంగా మార్చేశాయి.
4/14
కాషాయ, తెలుపు, ఆకుపచ్చతో పాటు తదితర రంగులు జలాలపై ప్రతిబింబించి, ఒక అద్భుతమైన దృశ్యం ఏర్పడింది. ఇది చూసి పర్యాటకులు మంత్ర ముగ్ధులవుతున్నారు.
5/14
పగటివేళ ఉన్న నీటి హోరు.. రాత్రి వేళ విద్యుద్దీపాల కాంతులో శ్రీశైలం డ్యామ్‌ను మరింత అందంగా మార్చివేస్తున్నది. వీటి చూసి సందర్శకులు పులకించిపోతున్నారు.
6/14
ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తున్నది.
7/14
ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ఉధృతి మరింత పెరగడంతో అధికారులు పది గేట్లను ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
8/14
పదిగేట్లను 12 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం జలాశయానికి 3,00,174 క్యూసెక్కుల వరద వస్తున్నది.
9/14
3,70,780 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉన్నది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.60 అడుగుల నీరుంది.
10/14
పూర్తిస్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 197.0114 టీఎంసీలు నిల్వ ఉంది.
11/14
కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.