Srisailam | సాంకేతిక రంగంలో ఆత్యంత వేగవంతమైన అభివృద్ది జరుగుతున్నందున సమాజంలోని మంచీ చెడుల పట్ల విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే అవగాహన కల్పించవలసిన గురుతర భాద్యత మన అందరిపై ఉందని శ్రీశైలం సీఐ వరప్రసాదరావు అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్దులకు పలు అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ది దశ నుంచే సామాజిక విషయాలపై చైతన్యం కలిగి ఉండటంతో భవిష్యత్లో ఎటువంటి సమస్యలనైనా చాకచక్యంగా ఎదుర్కొనే లక్షణాలను పొందుతారన్నారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు స్నేహ భావంతో వ్యవహరించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక భావాలు ప్రస్పుటమవుతాయని చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ వ్యాసరచన పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గురువయ్య, కానిస్టేబుల్ శివ, రఘునాయుడు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.