తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామి(tirupati kodanda ramaswamy)వారి నవాహ్నిక బ్రహ్మోత్సవా(brahamotsavam)ల్లో చివరిరోజు మంగళవారం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం (chakra snanam)నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ముందుగా శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థాని(Kapila teertam)కి తీసుకురాగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపనతిరుమంజనాన్ని నిర్వహించారు.

అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అక్కడినుండి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పీ.ఆర్ తోటకు తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అక్కడినుంచి బయలు దేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకుంటారని వివరించారు.
రాత్రి 8-30 గంటల నుంచి 9.30 గంటల వరకు ధ్వజాహరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, కంకణభట్టర్ ఆనందకుమార దీక్షితులు, సూపరింటెండెంట్ రమేశ్ కుమార్,భక్తులు పాల్గొన్నారు.