అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వందరోజుల ప్రణాళికను తయారు చేసుకుని రాష్ట్రంలో గంజాయి(Cannabis) సాగు, రవాణాలను అరికడతామని డీజీపీ(DGP) ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumal Rao) వెల్లడించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గతంలో తీవ్రవాదం(Terrorism ), ఎర్రచందనం మాఫియాను అదుపు చేశామని పేర్కొన్నారు. గంజాయి సాగును అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని , గంజాయి రవాణాపై అన్ని మార్గాల్లో నిఘా పెడుతామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటామని వివరించారు. గంజాయికి అలవాటు పడితే ఎంత ప్రభావం పడుతుందో అంతకంటే ఎక్కువగా యువకులు, విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంకరంగా మారుతుందని అన్నారు.
డ్రగ్స్ వినియోగించి క్రీడాకారులు, సెలబ్రిటీస్ జీవితాలు కోల్పోయ్యారని గుర్తు చేశారు. చిన్నారులు కూడా డ్రగ్స్‌కు బానిస కావడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపుడి అనిత విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడా దొరికినా ఆ మూలాలు విశాఖపట్నంలో ఉండడం బాధాకరమని అన్నారు. గంజాయిని పూర్తిగా అరికట్టడానికి వందరోజుల ప్రత్యేక ప్రణాళికను తయారుచేస్తామని పేర్కొన్నారు.