శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో (Srisailam Temple) జరుగనున్న కార్తీకమాసోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్‌రెడ్డి (EO Chandrasekhar Reddy) తెలిపారు. వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పార్కింగ్ సమస్యపై దృష్టిని సారించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఈవో ప్రధాన పార్కింగ్ స్థలాలను(Parking Places) పరిశీలించారు. కార్తీకమాసోత్సవాలకు వచ్చే భక్తుల కోసం (Kartika Masotsavam) ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, ఘంటామఠంప్రాంతం, టూరిస్ట్ బస్టాండ్‌తోపాటు, వలయ రహదారిపై కూడా వాహనాలు నిలుపుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు.
ఆలయ దర్శనానికి మార్గదర్శకాలతోపాటు అందరికీ అర్థమయ్యేలా వివిధ భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నసత్రాల వద్ద పార్కింగ్‌కు అనుమతి లేదని వెల్లడించారు. నిత్యాన్నదాన సత్రాలలో బస చేసేందుకు వచ్చే వాహనాలు పురవీధుల రోడ్లపై నిలిపేందుకు అనుమతిలేదని ఈవో స్పష్టం చేశారు. అత్యవసరాల కోసం సత్రాల ప్రాంగణంలో మాత్రమే వాహనాలను నిలుపుకోవాలని సూచించారు.