(Araku Train) ఆంధ్రప్రదేశ్ ఊటీగా పేరుగాంచిన అరకు లోయకు ఎల్లుండి నుంచి ప్రత్యేక రైలు నడవనున్నది. అరకు లోయకు వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని తూర్తు కోస్తా రైల్వే ఈ ఏర్పాట్లు చేసింది. విశాఖ జంక్షన్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి.. సింహాచలం. కొత్తవలస, ఎస్ కోట, బొర్రా గుహల మీదుగా అరకు లోయకు 11.30 కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు లోయ నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
నంబర్ 08525 రైలును ఈ మార్గంలో నడపనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకుల సౌకర్యార్ధం ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు. ప్రత్యేక రైలులో ప్రయాణించడం ద్వారా పర్యాటకులు కొత్త అనుభూతులను మూటగట్టుకుంటారని, ప్రకృతిని తనివిదీరా ఆస్వాదించే వీలుంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..