Mirzapur The Movie | అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై రచ్చ చేయడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూడు సీజన్ల పాటు ఓటీటీ ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్, ఇప్పుడు ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో భారీ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్‌ను విడుదల చేశారు.
ఈ టీజర్లో పంకజ్ త్రిపాఠి కాలీన్ భయ్యాగా, అలీ ఫజల్ గుడ్డూ భయ్యాగా, దివ్యేందు మున్నా భయ్యాగా తమ ఐకానిక్ పాత్రల్లో మళ్లీ కనిపించి అభిమానులను అలరించారు. మరోవైపు ఈ చిత్రంలో రవి కిషన్, పంచాయత్ ఫేమ్ జితేంద్ర కుమార్ కీలక పాత్రల్లో ఎంట్రీ ఇస్తూ మరింత ఆసక్తిని పెంచుతున్నారు. రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ టీజర్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మరింత భారీ యాక్షన్ మరియు పవర్ఫుల్ డైలాగ్స్‌తో సాగింది. ఈ సారి కేవలం మిర్జాపూర్ గద్దె కోసమే కాకుండా అధికారం కోసం కూడా యుద్ధం జరగబోతోందని టీజర్‌తో స్పష్టమవుతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషలో కూడా థియేటర్లలో విడుదలరాబోతున్నట్లు తెలుస్తుంది.