Venezuela Earthquakes: నిమిషం తేడాలో రెండు భారీ భూకంపాలు.. ఎందుకలా జరిగింది ?
Venezuela Earthquakes : సెసిమిక్ యాక్టివ్ జోన్లో వెనిజువెలా ఉన్నది. కరీబియన్, సౌత్ అమెరికన్ టెక్టానిక్ ప్లేట్లు అక్కడే కలుసుకుంటాయి. రెండో సారి భూకంపం చాలా లోతులో రావడం.. దాని వల్ల రెండు ఫలికాలకు చెందిన సరిహద్దుల వద్ద .. భీకర ఘర్షణ జరగడం వల్ల.. భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. చాలా సంక్లిష్టమైన రీతిలో ఒకే నిమిషం తేడాలో రెండు సార్లు భూమి కంపించిందని, అంటే భూ పొరల్లో చీలిక కూడా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు యూఎస్జీఎస్ పేర్కొన్నది.
కారకాస్: వెనిజువెలా దేశ చరిత్రలోనే అత్యంత భీకరమైన భూకంపాలు ఇవాళ నమోదు అయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత దేశ రాజధాని కారకాస్‌కు సమీపంలో రెండు భూ కంపాలు సంభవించాయి. మొదటి భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదు అయ్యింది. యారకూ రాష్ట్రంలోని శాన్ ఫిలిపే కేంద్రంగా ఆ భూకంపం వచ్చింది. మరో 32 సెకన్ల తేడాలోనే మళ్లీ భారీ భూకంపం నమోదు అయ్యింది. రెండోసారి 7.5 తీవ్రతో వెనిజువెలాను భూకంపం కుదిపేసింది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం జరిగింది. భూకం ధాటికి అనేక బిల్డింగ్లు కూలాయి. శిథిలాల కింద వేల సంఖ్యలో జనం చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వెనిజువెలాలో బుధవారం పబ్లిక్ హాలీడే. దీంతో ఎక్కువ శాతం మంది ఇండ్లల్లో లేదా పబ్లిక్ స్థలాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ప్రాణ నష్టం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు.
Two powerful Earthquakes 7.2- and 7.5-magnitude in Venezuela, causing buildings to collapse and forcing residents to flee for safety pic.twitter.com/6eRjJhTPub
— Science girl (@sciencegirl) June 25, 2026
వాస్తవానికి భౌగోళికంగా భూకంప ప్రభావిత జోన్లోనే వెనిజువెలా ఉన్నది. రెండు టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలోనే ఆ దేశం ఉంది. కరీబియన్‌తో పాటు దక్షిణ అమెరికా మీటింగ్ పాయింట్ వెనిజువెలానే. కరీబియన్, సౌత్ అమెరికన్ భూ ఫలకాలు కలిసిన ప్రదేశంలో వెనిజువెలా ఉండడం వల్ల… అక్కడ భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం ఉన్నది. భూగర్భంలో రెండు ఫలకాలు లేదా పొరల మధ్య కదలిక రావడం వల్ల ఇక్కడ భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. అయితే చాలా లోతులో భూమి కంపించడం.. ఆ తర్వాత స్లిప్ ఫాల్ట్ ఎక్కువగా ఉండడం వల్ల.. ఆ ఫలకాల సరిహద్దుల వద్ద.. రెండో సారి భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫలకాలు లేదా పొరల్లో పగుళ్లు లేదా ఫ్రాక్చర్ జరిగినా, లేక ఆ పొరలు అడ్డంగా కదిలినా.. భూకంపం సంభవిస్తుందని, అయితే ఆ ఫలకాల కదలిక వేగంగా ఉన్న సమయంలో.. భూకంప తీవ్రత అధికంగా ఉంటుందని, దాని వల్ల నష్టం కూడా భారీగా ఉంటుందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రెండు భూకంపాలు ఒకేసారి సంభవించడం అంటే, బహుశా భూ ఫలకాల్లో సంక్లిష్టమైన రీతిలో కుదుపు జరిగి ఉంటుందని, లేదా చీలిక వచ్చి ఉంటుందని యూఎస్జీఎస్ పేర్కొన్నది.
📌 Two powerful #earthquakes struck #Venezuela less than a minute apart, registering magnitudes of 7.2 and 7.5, resulting in dozens of deaths and hundreds of injuries, according to preliminary figures released by authorities. pic.twitter.com/zi4RaE9SpX
— Forbes Middle East (@Forbes_MENA_) June 25, 2026
రెండు తీవ్రమైన భూకంపాల తర్వాత సుమారు 20 సార్లు ప్రకంపనలు నమోదు అయినట్లు తెలుస్తోంది. వెనిజువెలా అధ్యక్ష కార్యాలయం దీనిపై ఓ ప్రకటన చేసింది. దేశంలోని ఉత్తర తీర ప్రాంతాల్లో ఉన్న లా గౌరియా, అరాగువా, కారాబోబో, ఫాల్కన్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉన్నది. ఆన్లైన్లో ప్రస్తుతం వెనిజువెలా భూకంప దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అనేక బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. జనం ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్తనాదాలు, రోదనలు మిన్నంటాయి. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 32గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ సంఖ్య వేలకు చేరుకునే అవకాశం ఉన్నది. భూకంపం వల్ల వెనిజువెలా ప్రధాన విమానాశ్రయం మైక్వెట్టా ఎయిర్పోర్టను మూసివేశారు. విమానాశ్రయంలో డ్యామేజ్ తీవ్రంగా ఉన్నట్లు అధ్యక్షురాలు తెలిపారు. సీలింగ్‌ల నుంచి భారీ ఎత్తున ఎయిర్‌పోర్టును దుమ్ము కమ్మేసింది.
🇻🇪 Today’s MASSIVE 7.5 magnitude earthquake was Venezuela’s biggest in more than a century, according to USGS data.
The last one bigger than this was 7.7 in 1900 off the northern coast, with an epicenter only a few hundred kilometers from this one.
Writer: Julie… https://t.co/y4llzG2tA1
— Mario Nawfal (@MarioNawfal) June 25, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

