అప్పులెవరి కోసం చేస్తున్నారో జగన్ చెప్పాలి : సోము వీర్రాజు డిమాండ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో.. ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను...
గుంటూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో.. ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి.. అవన్నీ తన ఘనతగా చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాగానే మూడేండ్లలో రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపోరులో భాగంగా ఆయన గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్, రైస్, మైన్స్ మాఫియా రాజ్యమేలుతున్నాయని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మద్యం అమ్మనివ్వనని కోతలు కోసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచి మద్యం ఏరులైపారేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వమే బ్రాండీ తయారు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. 50 రూపాయల విలువ చేసే మద్యాన్ని 200 రూపాయలకు అమ్ముతూ దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు. బటన్ నొక్కి జగనన్న డబ్బులిస్తున్నాడని అనుకుంటున్న జనం.. ఆ డబ్బంతా చెమటోడ్చి సంపాదించిన కార్మిక కర్షకులదని చెప్పారు.
జగన్‌లాంటి దోపిడీదారులను ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికే ఈ పోరుయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూడు రాజధానుల పేరిట ప్రభుత్వం కాలాయాపన చేస్తున్నదని మండిపడ్డారు. త్రీ క్యాపిటల్ అంటూ చెప్తాడు.. ఇక్కడే ఇళ్లు కట్టుకున్నా అంటాడు.. కానీ రాజధాని మాత్రం కట్టడు ఎందుకో అని ప్రశ్నించారు. ఎక్కడో ఒకచోట రాజధాని కడుతున్నది మాత్రం కనిపించడం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మూడేండ్లలోనే రాజధానిని నిర్మించి తీరుతామని హామీ ఇస్తున్నా అని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

