AP News | వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు
AP News | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పందించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి తమ పార్టీకి టచ్లో లేరని.. వాళ్లను తాము ఆహ్వానించమని స్పష్టం చేశారు. వాళ్లను పార్టీలో చేర్చుకునే ఆలోచనే లేదని కుండబద్ధలు కొట్టారు.
AP News | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పందించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి తమ పార్టీకి టచ్లో లేరని.. వాళ్లను తాము ఆహ్వానించమని స్పష్టం చేశారు. వాళ్లను పార్టీలో చేర్చుకునే ఆలోచనే లేదని కుండబద్ధలు కొట్టారు.
ఇక ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేతలు చెప్పడంపై కూడా సోము వీర్రాజు స్పందించారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అహంకార ధోరణి మారట్లేదని విమర్శించారు. ఎమర్జెన్సీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అదే తీరు కనబరుస్తుందని.. ఇప్పుడు పార్లమెంటులో కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీకి టచ్లో ఉన్నారని మొదటగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి స్వయంగా కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని బాంబు పేల్చారు. అయితే బీజేపీ నాయకత్వం వారిని అక్కర్లేదని చెప్పిందని, అయినప్పటికీ మిథున్ రెడ్డి ఇంకా లాబీయింగ్ నడిపిస్తున్నారని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జోరందుకుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

